సినీ నటి సమంత షూటింగ్లకు కాస్త బ్రేక్ దొరికితే చాలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. తాజాగా సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఆలయంలోకి వెళ్లాలంటే సుమారు 600లకు పైగా మెట్లు ఎక్కి వెళ్లాలి. సమంత కూడా మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తితో ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. సమంత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజెన్లు, అభిమానులు మయోసైటిస్ వ్యాధి నుండి సమంత త్వరగా కోలుకుని.. మరిన్ని సినిమాలు చేయాలని కామెంట్స్ పెడుతున్నారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదల కానుంది. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిస్తున్న శాకుంతలం మూవీని త్రీడీ టెక్నాలజీలో చేస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో సమంత పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్నారు. ఇక విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీలో సమంత నటించనున్నారు.