Samantha: తప్పు చేశాను ఒప్పుకుంటున్నా.. నెటిజన్ ప్రశ్నకు సమంత క్లారిటీ

Samantha: తప్పు చేశాను ఒప్పుకుంటున్నా.. నెటిజన్ ప్రశ్నకు సమంత క్లారిటీ

సౌత్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటివరకు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఆమె కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేశారు సమంత. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాను ఓకే చేయలేదు సమంత. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హానీ బన్నీ సినిమా వెబ్ సిరీస్ చేస్తున్నారు.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా వస్తోంది ఈ సిరీస్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ బ్యూటీ సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో మంచ్చటించారు సమంత.

ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ఇవన్నీ బాగానే చెబుతారు. కానీ, మీరే ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశారు.. అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సమంత స్పందిస్తూ.. అవును.. గతంలో నేను తప్పులు చేసిన మాట నిజమే. కానీ, అవి తెలిసి చేసినవి కాదు. వాటి గురించి తెలిసాక ఆ బ్రాండ్స్ ప్రమోషన్స్ ఆపేశాను. ప్రస్తుతం నేను ఏదైతే చేస్తున్నానో.. వాటి గురించి మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు సమంత. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.