
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సంస్కృతి, సంప్రదాయాల మేళవింపే సంక్రాంతి పండుగ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం పట్టణం పాతకొత్తగూడెంలో యువజన సమాఖ్య నేత నిమ్మగడ్డ వికాస్ జ్ఞాపకార్థం ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. పట్టణంలోని కూలీలైన్, చంచుపల్లి మండలంలోని గరిమెళ్లపాడు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, కె. రత్నకుమారి, ఫహీమ్, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, ప్రసాద్ పాల్గొన్నారు.