జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి : కూనంనేని సాంబశివరావు

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి : కూనంనేని సాంబశివరావు
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు స్పెషల్​ కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. కలెక్టరేట్​లో షెడ్యూల్​ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ కేసులపై కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధ్యక్షతన గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం పథకాలను పక్కాగా అమలు చేయాలన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

భద్రాచలంలో మొబైల్​ కోర్టులో జడ్జీ లేకపోవడంతో చాలా కేసులు పెండింగ్​లో ఉన్నాయని, నియామకానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎస్పీ బి. రోహిత్​ రాజు, ఆర్డీవో మధు, ఏపీవో జనరల్​ఐటీడీఏ డేవిడ్ ​రాజు, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర, సీపీవో సంజీవరావు, డీఎంహెచ్​ఓ భాస్కర్​ నాయక్, కలెక్టరేట్​ఏవో రమాదేవి, మెంబర్లు ఎనుమురి లక్ష్మీబాయి, చింతల రవికుమార్, లౌడియా సామ్య, లకావత్​ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

తరుగు పేరిట ఇబ్బంది పెట్టొద్దు

ధాన్యం కొనుగోళ్లలో తేమ, తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. చుంచుపల్లి మండలంలోని పెనగడపలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మిమోస పోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీసీఎంఎస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాస్, డీఎంవో త్రినాథ్​ బాబు, డీసీసీబీ మేనేజర్​ శాంతి, సొసైటీ చైర్మన్​ మండే హనుమంతరావు, డైరెక్టర్​ చంద్రగిరి శ్రీనివాసరావు, ఏడీఏ నర్సింహరావు, తహసీల్దార్​ కృష్ణ, సీపీఐ, కాంగ్రెస్​ నేతలు నాగ సీతారాములు, సాబీర్​ పాషా పాల్గొన్నారు.