పాల్వంచ రూరల్, వెలుగు : కొత్తగూడెంలో సీపీఐ గెలుపు ఖాయమని, ఏ శక్తి అడ్డుకోలేదని అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చెప్పారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని దంతెలబొర, నాగరం, సంగం, జగన్నాధపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో రౌడీమూకల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. రంగులు మార్చే నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పాలన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.