యూపీలోని సంబాల్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసుకు సంబంధం ఉందంటూ సమాజ్ వాది ఎంపీ జాహర్ రహ్మాన్ బార్క్ పై పోలీపులు కేసు నమోదు చేశారు. అయితే సంబాల్ ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాలని సమాజా వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఆదివారం( నవంబర్ 24) యూపీలోని సంబాల్ లో మసీదు సర్వే చేస్తున్న సమయంలో కొందరు అడ్డుకొని అల్లర్లు సృష్టించడంలో హింస చెలరేగింది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసుల కాల్పులు జరిపారు ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఈ ఘటన వెనక సమాజ్ వాది ఎంపీ జాహర్ రహ్మాన్ బార్క్ హస్తం ఉందని పోలీసులు అయనపై కేసు నమోదు చేశారు.
అయితే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను సంబాల్ లో లేనని.. బెంగళూరులో ఓ సమావేశంలో పాల్గేనేందుకు వెళ్లానని బార్క్ చెప్పారు. కావాలనే తనపై కుట్ర చేసి ఇరికించి తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ ఘటనలో నలుగురు అమాయకులు చనిపోయారని.. ఈ ఘటన వెనకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోలీసులు వెర్షన్ మరోలా ఉంది..ఆదివారం మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహిస్తుండగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 25 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి కొన్ని రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరంతా నఖాశా పోలీస్ స్టేషన్ ఏరియాకు చెందిన వారని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.. మరికొంత మంది గాయపడ్డారని తెలిపారు.