
గత నవంబర్ లో యూపీలోని సంబాల్ లో జరిగిన అల్లర్ల కేసులో సంభాల్ షాహి జమా మసీదు కమిటీ ప్రెసిడెంట్ జాఫర్ అలీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం (మార్చి23) ఉదయం అలీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అలీ స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.
ALSO READ | బెంగళూరులో కుప్పకూలిన 120 అడుగుల రధం.. ఒకరు మృతి
గతేడాది నవంబర్ 24న యూపీలోని సంబాల్ లోని మొఘల్ కాలం నాటి మసీదు సర్వేలో ఘర్షణలు చెలరేగి నలుగుురు మృతిచెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ స్థలంలో ఒకప్పుడు పురాతన హిందూ దేవాలయం ఉండేదని దాఖలైన పిటిషన్ తర్వాత సర్వే సమయంలో ఈ ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్చి 24 న కమిటీ ముందు షాహి జామా మసీదు ప్రెసిడెంట్ జాఫర్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా నే కమిషన్ ముందు వాంగ్మూలం సమర్పించకుండా అరెస్ట్ చేశారని అలీ సోదరుడు ఆరోపించారు.