బీఆర్ఎస్​లోకి సంభాని చంద్రశేఖర్ : కేసీఆర్ సమక్షంలో చేరిక

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ సీనియర్​ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు సీనియర్​నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

విద్యార్థి ఉద్యమ నాయకుడు, పీసీసీ జనరల్ సెక్రటరీ కోటూరి మానవతారాయ్, పీసీసీ జనరల్​ సెక్రటరీ, కొత్తగూడెం కాంగ్రెస్​ఇన్ చార్జ్ ఎడవెల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య దంపతులు, డాక్టర్​రామచంద్ర నాయక్​తదితరులు బీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు నేత మడత వెంకట్​గౌడ్​తదితరులు పాల్గొన్నారు.