
- దిశారవి అరెస్టుపై ఢిల్లీ పోలీసులు
- జనవరి 11న జరిగిన మీటింగ్ వివరాలివ్వాలని ‘జూమ్’కు లెటర్
- ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ/ముంబై: రైతుల నిరసనలకు మద్దతుగా స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్(డాక్యుమెంట్)’ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో రైతు నాయకుల పాత్ర విషయంపైనా ఇన్వెస్టిగేషన్ జరుపుతామని వెల్లడించారు. కుట్ర, దేశద్రోహం కేసుల కింద ఇప్పటికే దిశారవిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ విషయంలో వస్తున్న విమర్శలపై స్పందించారు. అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యామని మంగళవారం చెప్పారు. ‘‘రూల్స్ ప్రకారమే దిశా రవిని అరెస్టు చేశాం. వయసు 22 అయినా.. 50 అయినా.. అందరికీ ఒకే న్యాయం వర్తిస్తుంది. దిశను అరెస్టు చేయాలన్న మా నిర్ణయాన్ని కోర్టు కూడా అంగీకరించింది. అలాగే ఆమెను 5 రోజుల రిమాండ్‌కు అప్పగించింది’’ అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు.
ఫండింగ్ చేస్తున్నదెవరు?
టూల్‌కిట్ కేసుకు ఫండింగ్చేసింది ఎవరనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ డాక్యుమెంట్‌కు సంబంధించి ఇప్పటిదాకా గూగుల్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పాయి. డిసెంబర్ 6న ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ ఫార్మర్స్ స్ట్రైక్’ అనే వాట్సాప్గ్రూప్పైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పాయి. మరోవైపు జనవరి 11న జరిగిన మీటింగ్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ వీడియో కమ్యూనికేషన్స్ యాప్ ‘జూమ్’కు పోలీసులు లెటర్ రాశారు.
టూల్‌కిట్.. ఓ ‘సమాచార నిధి’: నికితా జాకబ్
గ్రెటా థెన్బర్గ్తో తాను ఎలాంటి సమాచారం పంచుకోలేదని లాయర్, యాక్టివిస్ట్ నికిత జాకబ్ చెప్పారు. టూల్‌కిట్ ఒక ‘సమాచార నిధి(ఇన్ఫర్మేషనల్ ప్యాక్)’ లాంటిదని, హింసను ప్రేరేపించేందుకు ఉద్దేశించినది కాదని చెప్పారు. ముంబై పోలీసులకు పూర్తి వివరాలతో కూడిన ఓ డాక్యుమెంట్‌ను ఆమె లాయర్ సమర్పించారు. టూల్‌కిట్‌ను ఎక్స్టెన్షన్ రెబెలియన్ (ఎక్స్ఆర్) ఇండియా వాలంటీర్లు ప్రిపేర్ చేస్తున్నారని.. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు ఈజీగా అర్థమయ్యేందుకు దాన్ని తయారు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు
ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిం ది. దిశారవి అరెస్టు విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలే దన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ కాపీ, డీటైల్డ్ యాక్షన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
దిశ అరెస్టుపై నిరసన
దిశారవి అరెస్టుకు వ్యతిరేకంగా ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) ఆందోళనలు చేసింది. ఢిల్లీ పోలీసు హెడ్క్వార్టర్స్దగ్గర నిరనసలకు దిగింది.
For More News..