బ్రో టూ మచ్: సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న మగాళ్లు

బ్రో టూ మచ్: సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న మగాళ్లు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు  విషయం వెలువరించిన తెలిసిందే. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? లేదా అనేది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు మాత్రమే అధికారం ఉందని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ  తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALSO READ : ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కేసు.. ఆజం ఖాన్‌తో పాటు భార్య, కొడుకుకు 7ఏళ్ల జైలు శిక్ష
 

స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు తీర్పు తమకు నిరాశ గురి చేసిందన్న అనన్య కోటియా, ఉత్కర్ష్ సక్సేనా జంట దేశ అత్యున్నత న్యాయస్థానం ఎదుటే నిశ్చితార్థం చేసుకున్నారు. "సుప్రీం కోర్టు తీర్పు మమ్మల్ని ఎంతగానో బాధించింది. అందువల్ల మా హక్కులను నిరాకరించిన కోర్టు ఎదుటే ఉంగరాలు మార్చుకున్నాము. ఈ నిశ్చితార్థం మా హక్కులను కోల్పోయినందుకు కాదు.. మా చట్టబద్ధత గురుంచి  మరొక రోజు పోరాడతాం..' అని ఉత్కర్ష్ సక్సేనా ట్వీట్ చేశారు.

15 ఏళ్ల ప్రేమ

ఇండియాకు చెందిన ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం..  ప్రేమకు దారితీసింది. 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. కాగా, స్వలింగ సంపర్కులు సహజీవనం చేయటం నేరం కాదంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.