
వెస్ట్ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది ఈసీ. బీజేపీని టార్గెట్ చేస్తూ మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఖండించింది ఈసీ. ఒకే ECI నంబర్ తో రెండు ఓట్లు ఉండటం అసాధ్యమని స్పష్టం చేసింది ఈసీ. ERONET సిస్టం అమల్లోకి రాకముందు డూప్లికేట్ నంబర్స్ సిస్టం ఉండేదని.. ఇది అవుట్ డేటెడ్ సిస్టం అని పేర్కొంది ఈసీ.EPIC నంబర్ల డూప్లికేషన్ జరిగినంత మాత్రాన నకిలీ ఓట్లు రికార్డ్ అయినట్లు కాదని.. గతంలో ఉన్న మాన్యువల్ సిస్టం వల్ల జరిగిన పొరపాట్లు అని పేర్కొంది ఈసీ.
రెండు రాష్ట్రాల ఓటర్లు ఒకేలాంటి EPIC నంబర్లను కలిగి ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఈసీ.. కొంతమంది ఓటర్ల EPIC నంబర్లు ఒకేలా ఉన్నప్పటికీ... డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్‌తో సహా ఇతర వివరాలు ఒకే EPIC నంబర్ ఉన్న ఓటర్లకు భిన్నంగా ఉంటాయని స్పష్టం నచ్చేసింది.
EPIC నంబర్‌తో సంబంధం లేకుండా, ఏ ఓటరు అయినా వారు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్న వారి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని సంబంధిత నియోజకవర్గంలో కేటాయించిన పోలింగ్ స్టేషన్‌లో మాత్రమే ఓటు వేయగలరని.. మరెక్కడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది ఈసీ.