యూపీ యువ ఆటగాడు, అనక్యాప్‌డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ భారీ ధర పలికాడు. 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ రిజ్వీ రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో భారత బౌలర్ ఆవేశ్ ఖాన్ అనక్యాప్‌డ్ ప్లేయర్ గా రూ.10 కోట్లు పలికాడు. క్రికెట్ లో పెద్దగా పరిచయం లేని సమీర్ రిజ్వీకికు ఇంత మొత్తంలో ధర పలకడం హైలెట్ గా మారింది.
సమీర్ రిజ్వీ:
ఈ 20 ఏళ్ల యువ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్, మీరట్ కు చెందిన వాడు. రైట్ ఆర్మ్ బ్యాటరైన రిజ్వీ మంచి ఆఫ్ స్పిన్నర్ కూడానూ. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగల సమర్ధుడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి ఆల్ రౌండర్. అందువల్లే ఇతనిపై హైప్ క్రియేట్ అవుతోంది.
ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్ లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అలాగే, అండర్ 23 స్టేట్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిజ్వీ.. యూపీ జట్టును విజేతగా నిలిపాడు. అరుణ్ జైట్లీ వేదికగా ఉత్తరాఖండ్ తో జరిగిన ఫైనల్లో రిజ్వీ 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు కీలక పాత్ర పోషించాడు.
Sameer Rizvi sold to CSK at 8.40cr.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
- One of the finest players in the domestic circuit!pic.twitter.com/FxQy6pxyFZ