చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు గానీ.. ఎలాంటి ప్లేయర్ అయినా స్టార్ ప్లేయర్ గా మారిపోవడం గ్యారంటీ. పనికిరారనుకున్న ప్లేయర్లు ఈ జట్టులో చేరి అద్భుతాలు చేస్తున్నారు. శివమ్ దూబే, అజింక్య రహానే, తుషార దేశ్ పాండే ఈ కోవ కిందే వస్తారు. యంగ్ ప్లేయర్ పతిరానా సైతం తొలి టోర్నమెంట్ లోనే ధోనీ కెప్టెన్సీలో ఆకట్టుకున్నాడు. తాజాగా సమీర్ రిజ్వి తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే అదరగొట్టాడు. డెబ్యూ మ్యాచ్ అయినా తొలి బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ తో తన ఎంట్రీని గ్రాండ్ గా చాటుకున్నాడు.
6 బంతుల్లోనే 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి చెన్నై భవిష్యత్తు కెరటంగా నిలిచాడు. యూపీకి చెందిన ఈ యువ ఆటగాడు 2023 ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికాడు. 8.4 కోట్లకు సమీర్ రిజ్విను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ రిజ్వీ రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో భారత బౌలర్ ఆవేశ్ ఖాన్ అనక్యాప్‌డ్ ప్లేయర్ గా రూ.10 కోట్లు పలికాడు. క్రికెట్ లో పెద్దగా పరిచయం లేని సమీర్ రిజ్వీకికు ఇంత మొత్తంలో ధర పలకడం హైలెట్ గా మారింది.
ఎవరీ సమీర్ రిజ్వి ?
ఈ 20 ఏళ్ల యువ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్, మీరట్ కు చెందిన వాడు. రైట్ ఆర్మ్ బ్యాటరైన రిజ్వీ మంచి ఆఫ్ స్పిన్నర్ కూడానూ. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగల సమర్ధుడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి ఆల్ రౌండర్. అందువల్లే ఇతనిపై హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : హైదరాబాద్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై
ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్ లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అలాగే, అండర్ 23 స్టేట్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిజ్వీ.. యూపీ జట్టును విజేతగా నిలిపాడు. అరుణ్ జైట్లీ వేదికగా ఉత్తరాఖండ్ తో జరిగిన ఫైనల్లో రిజ్వీ 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు కీలక పాత్ర పోషించాడు. మరి ఈ యువ క్రికెటర్ అంచనాలు అందుకోగలడా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Sameer told us that he will start his IPL career by hitting six on 1st ball.
— ` (@WorshipDhoni) March 27, 2024
- Sameer Rizvi's Family Member
Confidence level 🫡
pic.twitter.com/B6JMEb0XhD