
చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం (ఏప్రిల్ 5) మ్యాచ్ ప్రాంభమైంది. ఈ హై వోల్టేజ్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఓపెనర్ డుప్లెసిస్ స్థానంలో సమీర్ రిజ్వి ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఒక ఫారెన్ ప్లేయర్ స్థానంలో సమీర్ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సౌతాఫ్రికా పవర్ హిట్టర్ డోనోవన్ ఫెర్రీరా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడడంతో పాటు.. ప్రపంచ టీ20 లీగ్ లు ఆడిన అనుభవం ఉంది.
ఢిల్లీ సమీర్ రిజ్వికి అవకాశం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతను కూడా మెరుపులు మెరిపించగలడు. పైగా ఇండియా ప్లేయర్ కు అవకాశమిస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. సమీర్ రిజ్వి ఇప్పటివరకు 10 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 115 స్ట్రైక్ రేట్ తో 60 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి ఘోరంగా విఫలమయ్యాడు. 2025 మెగా ఆక్షన్ లో ఈ యువ బ్యాటర్ ను రూ. 95 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్ లో రిజ్వి ఎంతవరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి.
►ALSO READ | LSG vs MI: ‘వాడు ఎక్కడున్నా రాజేరా’: రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్‌కు నికోలస్ పూరన్ ఔట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రాహుల్ (49), రిజ్వి(7) క్రీజ్ లో ఉన్నారు. అభిషేక్ పోరెల్ (33), అక్షర్ పటేల్ (21) పర్వాలేదనిపించగా.. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ డకౌటయ్యాడు. చెన్నై బౌలర్లలో జడేజా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
Sameer Rizvi is going to play well today, isn’t he? https://t.co/L1OHNytRsE
— Dante (@PhiilDunphyy) April 5, 2025