వాహనాల చోరీ ముఠా సభ్యుడు అరెస్ట్

వాహనాల చోరీ ముఠా సభ్యుడు అరెస్ట్

శామీర్ పేట వెలుగు: చెడు వ్యసనాలకు బానిసలైన చోరీల ముఠా సభ్యుల్లో ఒకరిని శామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం ఖానాపూర్, బేగంపేట్, చొప్పదండి ప్రాంతాలకు చెందిన గబ్బికోట మహేందర్(27), మానుపాటి శేఖర్(40), ప్రశాంత్( 29), గణేష్ (28), మహేష్ (25), సంజీవ(30)  చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు. వీరంతా ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం వాహనాల స్క్రాప్ చోరీలకు పాల్పడుతున్నారు.

గత జనవరిలో షామీర్ పేట దర్గా చౌరస్తా వద్ద స్క్రాప్ షాప్ లోని  బొలెరోను చోరీ చేసి పెద్దపల్లికి వెళ్లారు. ఈనెల 3న శామీర్ పేట పోలీసులు ఔటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. బొలెరోను ఆపి పత్రాలను పరిశీలించగా, గబ్బికోట మహేందర్ కేకలు వేయడంతో వాహనంలోని ఇద్దరు, వెనక కారులో వచ్చిన ముఠా సభ్యులు పారిపోయారు. దీంతో పోలీసులు రెండు వాహనాలతో పాటు మహేందర్ ను  అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.