జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ యంగ్‌ షట్లర్‌ సామియా ఇమాద్‌ ఫరూఖి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నెంబర్-2 ర్యాంక్‌ సాధించింది. అండర్‌–15 ఏషియన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ అయిన 17 ఏళ్ల ఈ యంగ్‌ షట్లర్‌ జూనియర్‌ సర్క్యూట్‌లో సత్తా చాటుతోంది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్ యూఎఫ్‌) శుక్రవారం రిలీజ్‌ చేసిన లేటెస్ట్‌ ర్యాంకింగ్స్‌ వుమెన్స్​ సింగిల్స్​లో ఆరు ప్లేస్‌‌లు ఇంప్రూవ్‌ అయిన ఆమె కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకుంది. సామియాతో పాటు ఆరుగురు ఇండియన్స్‌ టాప్‌–10లో చోటు దక్కించుకున్నారు. జూనియర్‌ మెన్స్‌ సెక్షన్‌లో వరుణ్‌ కపూర్‌ నాలుగు స్థానాలు మెరుగై సెకండ్‌ ర్యాంక్‌కు చేరాడు. అమ్మాయిల్లో తస్నిమ్‌ మిర్‌(4వ ర్యాంక్‌), త్రీసా జొల్లీ (8), అదితి భట్ (10) టాప్‌ –10లో నిలిచారు. డబుల్స్‌లో త్రీసా (8), తనీషా క్రాస్టో (9), అదితి (9) కూడా టాప్‌ –10లో చోటు దక్కించుకున్నారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!