కోదాడ, వెలుగు: కోదాడను వర్తక, వాణిజ్య రంగాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల సూచించారు. ఆదివారం కోదాడ పట్టణంలోని వర్తక సంఘం భవన్‌లో కోదాడ వర్తక సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి డీఎస్పీ శ్రీధర్ రెడ్డితో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షుడిగా మేళ్లచెరువు కిషోర్, ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు పూర్ణచంద్రరావు, కోశాధికారిగా కొత్త శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా బండారు వెంకటేశ్వర్లు చల్లా విజయ్ శేఖర్,కందిబండ శ్రీనివాసరావు, చిన్న బ్రహ్మం, వంగవీటి శేఖర్, సురేందర్ కుమార్, జాయింట్ సెక్రటరీగా చీదేళ్ల సురేశ్, సత్యనారాయణ
దుర్గారావు ఇరుకుల్ల రాధాకృష్ణ ,గాధం శెట్టి సంతోశ్, ఉప కోశాధికారిగా మేళ్లచెరువు వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పట్టణ నాయకులు , వర్తక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. పలు పార్టీల నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, పైడిమరి సత్తిబాబు, పార సీతయ్య ,యాదా రమేశ్ ,మేకల శ్రీనివాసరావు, ముత్యాలు, రాయపూడి వెంకటనారాయణ, గాదంశెట్టి శ్రీనివాసరావు,పైడిమర్రి వెంకటనారాయణ, కొత్త వెంకటేశ్వర్లు, గరినే శ్రీధర్, సామినేని రమేశ్, వంగవీటి నాగరాజు, చారు గుండ్ల రాజశేఖర్ పాల్గొన్నారు.