ది వాల్, మిస్టర్ డిపెండబుల్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లోనే అతని కొడుకు సమిట్ నడుస్తున్నాడు. గతేడాది పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కర్ణాటక అండర్-19 జట్టులో చోటు దక్కించుకోగా.. ఇటీవలే అతను కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో మెరిశాడు. తాజాగా భారత అండర్-19 టెస్ట్ జట్టులో చోటు దక్కించుకొని క్రికెట్ లో శర వేగంగా దూసుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19తో మల్టీ ఫార్మాట్ హోమ్ సిరీస్ కు భారత అండర్-19 స్క్వాడ్ లో సమిత్ సెలక్ట్ అయ్యాడు.
భారత అండర్-19 సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా U19తో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 7న రెండు టెస్టులు సిరీస్ కు సమిత్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం మహారాజా టోర్నీలో ఆడుతున్న సమిత్.. నాలుగు మ్యాచ్ ల్లో 114 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. అతనికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. మహ్మద్ అమన్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సోహమ్ పట్వర్ధన్ నాలుగు రోజుల మ్యాచ్‌ల జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
వన్డే సిరీస్ కు భారత అండర్-19 జట్టు
మహ్మద్ అమన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాఖ్, కార్తికేయ కెపి, కిరణ్ చోర్మలే, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్, రోహిత్ రాజావత్, మొహమ్మద్ ఎనాన్
నాలుగు రోజుల టెస్ట్ సిరీస్ కు భారత అండర్-19 జట్టు
సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్యా, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), కార్తికేయ కెపి, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), చేతన్ శర్మ, సమర్థ్ ఎన్, ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్,అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మొహమ్మద్ ఈనాన్
SAMIT DRAVID IN INDIAN U-19 TEAM. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) August 31, 2024
- Junior Dravid has been included in the Indian U-19 team for One-Day series & 4 day match against Australia....!!!! pic.twitter.com/GwwEcDGK7m