పండితాపురంలో సమ్మక్క-, సారక్క మినీ జాతర

కామేపల్లి,  వెలుగు : మండలంలోని పండితాపురంలో గురువారం సమ్మక్క-, సారక్క మినీ జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉదయం మహిళలు బోనాలు ఎత్తుకొని మేళ తాళాలతో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ  తల్లుల గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక  పూజారులు బోయినపల్లి శ్రీను స్వామి, దొడ్ల శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు చిలకల వెంకట నరసయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మూకమామిడి జాతర..

ములకలపల్లి, వెలుగు : ములకలపల్లి మండలంలోని మూకమామిడిలోని సమ్మక్క, సారలమ్మ దేవాలయంలో మూడు రోజులు నిర్వహించిన మినీ మేడారం జాతర ముగిసింది. గురువారం చివరి రోజైన సమ్మక్క తల్లి గద్దె పూజ, ఎదుర్కొళ్లు, సమ్మక్క తల్లి ని గద్దె కు తీసుకురావడం, అమ్మవార్లకు బోనాలు,మొక్కులు  చెల్లించడం,గ్రామంలోని వీధులలో ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు.