ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువుదీరిన తల్లులు

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ సమ్మక్కను వనం నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఎత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నల్లబెల్లి మండలం మద్దిమేడారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, చిల్పూర్ మండలాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అమ్మవార్లను దర్శించుకున్నారు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర, భీమదేవరపల్లి మండలం ములుకనూర్, కొత్తకొండలో సమ్మక్క సారలమ్మలను మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ దర్శించుకొని ఎత్తు బంగారం సమర్పించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో సమ్మక్క వచ్చే టైంలో తొలిసారిగా సెంట్రల్ జోన్ డీసీపీ మహ్మద్‌‌‌‌‌‌‌‌ బారీ మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.