గోదావరిఖనిలో మినీ జాతర ప్రారంభం

గోదావరిఖనిలో మినీ జాతర ప్రారంభం

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖనిలోని గోదావరి తీరాన ఉన్న సమ్మక్క, సారలమ్మ జాతరను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. సమ్మక్క, సారలమ్మ మినీ జాతర సందర్భంగా బుధవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచనల మేరకు జాతర స్థలాన్ని అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు సంబంధించి అన్ని పర్మిషన్లు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోటూ జీఎం గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, ఆంజనేయప్రసాద్, జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరప్రసాద్​, ఆలయ  కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.