గుండాలకు చేరుకున్న పగిడిద్దరాజు

గుండాల, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యపలగడ్డ గ్రామం నుంచి ములుగు జిల్లా మేడారం వెళ్లిన సమ్మక్క భర్త పగి డిద్దరాజు ఆదివారం యపలగడ్డకు చేరుకున్నారు. మేడారం జాతర ముగియడంతో ఆరెం వంశీయులు మేళతాళాలతో కాలినడకన 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి రెండు రోజులకు గుండాలు చేరుకున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పగిడిద్దరాజును దర్శించుకున్నారు.అనంతరం మండలకేంద్రం నుంచి ఊరేగింపుతో యపలగడ్డ గ్రామ సమీపంలోని గర్భగుడి వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం ఆరెం వంశీయులు అప్పయ్య, ఇద్దయ్య, నాగయ్య, భిక్ష్యం, కాంతారావు మాట్లాడుతూ16 రోజుల తర్వాత గుండాల మండలం యపలగడ్డ గ్రామ సమీపంలో ని సమ్మక్క, పగిడిద్దరాజు గద్దెల వద్ద పగిడిద్దరాజు సమ్మక్కల జాతర జరుగుతుందని చెప్పారు.