
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన దశరథం (38) మంగళవారం కన్నుమూశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మంగళవారం ఉదయం కండ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో మేడారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డాక్టర్లు చికిత్స చేస్తుండగానే చనిపోయారు. మృతుడికి భార్య విజయ, కొడుకు అశ్విత్, బిడ్డ సాత్విక ఉన్నారు. పది నెలల క్రితం మృతుడి సోదరుడు లక్ష్మణరావు అనారోగ్యంతో చనిపోయారు. దశరథం మృతిపై మంత్రి సీతక్క సంతాపం ప్రకటించారు. వారి లేని లోటు తీర్చలేనిదన్నారు.