చిన్న మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

రాజాపేట, పెన్​పహాడ్​ వెలుగు: ఉమ్మడి జిల్లాలోని రాజాపేట మండలం కుర్రారం, చల్లూరు, లక్ష్మక్కపల్లి, గుండాల మండలం సీతారాంపురం, పెన్‌‌‌‌‌‌‌‌ పహాడ్ మండలం గాజుల మల్కాపురంలో సమ్మక్క, సారలమ్మ జాతరలు వైభవంగా కొనసాగుతున్నాయి.  చిన్నామేడారంగా పేరొందిన కుర్రారంలో ఇప్పటికే సారలమ్మ గద్దెకు చేరగా.. గురువారం సమ్మక్క కూడా వనం నుంచి జనంలోకి వచ్చింది.

పూజారులు సమ్మక్కని పులిగుట్ట నుంచి భారీ బందోబస్తు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా  శివసత్తుల పూనకాలు,  భక్తుల అమ్మల నామస్మరణతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.   

అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు

కుర్రారంలోని చిన్న మేడారంలో ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పెన్​ పహాడ్​లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం రాష్ట్ర స్థాయి మహిళ  కోలాటం పోటీలను ప్రారంభించారు.