
చండ్రుగొండ, వెలుగు : బెండాలపాడు గ్రామంలో ఆదివాసీల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఆదివాసీ పూజారులు, కమిటీ సభ్యులు కనిగిరి గుట్టల పై ఉన్న చిలకలగుట్టకు తరలించారు. పలుగ్రామాల భక్తులు గద్దెలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.