అనారోగ్యంతో సమ్మక్క పూజారి మృతి

అనారోగ్యంతో సమ్మక్క పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి, బయ్యక్కపేటకు చెందిన చందా శేషగిరి (40) అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శేషగిరి బుధవారం సాయంత్రం ఇంటి వద్ద కండ్లు తిరిగి పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు శేషగిరి తలలో బ్లడ్‌ క్లాట్‌ అయిందని చెప్పి వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ గురువారం సాయంత్రం చనిపోయాడు. మృతుడికి భార్య లలిత, కూతురు ఉన్నారు.