Darius Visser: ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యువరాజ్ రికార్డు సమం

Darius Visser: ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యువరాజ్ రికార్డు సమం

చిన్న చిన్న దేశాలు క్రికెట్ ఆడటం ఏమో కానీ, వారి బౌలింగ్, ఫీల్డింగ్ దెబ్బకు బడా బడా దేశాల క్రికెటర్లకు చిక్కొచ్చి పడింది. అగ్రశ్రేణి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని బ్యాటర్లు అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పితే.. వాటిని బుడ్డ బుడ్డ దేశాల క్రికెటర్లు కనుమరుగు చేస్తున్నారు. 

30వేల మంది ప్రేక్షకుల నడుమ.. ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఊచకకోత కోస్తూ..యువీ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆ జరిగిన ఆ మ్యాచ్‌ను తలచుకుంటేనే రోమాలు నిగ్గబొడుచుకుంటాయి. ఫ్లింటాఫ్ నోటి దూలకు యువీ ఇచ్చిన సమాధానం.. మ్యాచ్ సాగిన తీరు.. ఆ కథే వేరు. అటువంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యువీ నెలకొల్పిన రికార్డును.. ఓ అనామక క్రికెటర్ సమం చేశాడు. అలవోకగా ఒకే ఓవర్‌లో 6 సిక్సులు బాదేసి రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. 

సమోవా vs వనాటు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆసియా-పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయర్‌ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం సమోవా, వనాటు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు రాబట్టాడు. ఇందులో 6 సిక్సర్లు ఉన్నాయి. సమోవా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘనత చోటుచేసుకుంది.

మూడు నో బాల్స్.. ఓవర్‌కు 9 బంతులు 

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టినందుకు విస్సర్ ను మెచ్చుకోవలసిందే అయినా.. ఆ రికార్డును అతను చేరుకోవడానికి సహాయ పడింది మాత్రం వనాటు బౌలర్ నిపికో. ఆ ఓవర్‌లో ఏకంగా తొమ్మిది బంతులేశాడు. అందులో మూడు నో బాల్స్ సంధిచడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన క్రికెటర్లు

  • హర్షెల్ గిబ్స్: నెదర్లాండ్స్ (2007, వన్డే)
  • యువరాజ్ సింగ్: ఇంగ్లాండ్ పై(2007 టీ0 ప్రపంచకప్)
  • కీరన్ పొలార్డ్: శ్రీలంకపై (2021, టీ20)
  • జస్కరన్ మల్హోత్రా: పాపువా న్యూ గినియాపై (2021, వన్డే)

6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు

  • రవిశాస్త్రి (1985): బరోడాతో జరిగిన మ్యాచ్‌లో(బౌలర్: శాస్త్రి తిలక్ రాజ్‌)
  • యువరాజ్ సింగ్ (2007): ఇంగ్లండ్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో (ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన తప్పులకు స్టువర్ట్ బ్రాడ్‌ను శిక్ష)
  • రుతురాజ్ గైక్వాడ్ (2022): ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (విజయ్ హజారే ట్రోఫీ)