ఇండియన్ ఫుడ్స్‌లో సమోసాలకు ఉండే క్రేజ్‌యే వేరు.. సమోసాలు చాలామంది ఫేవరేట్ వంటకాలుగా కూడా ఉంటాయి. అలూ సమోసా, ఉల్లిపాయ సమోసా అని ఇలా అనేక రకాలు ఉంటాయి. సమోసాలు తినే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. నోరూరించే సమోసాలాంటి స్నాక్స్ మీ ప్రాణాల మీదకు తెస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.
ఈ సమోసాలు తినడం తినే వారు త్వరగా మధుమేహం బారిన పడుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువసేపు వేడి చేసి అధిక ఉష్ణోగ్రతలో ప్రాసెస్ చేసిన ఆహారంలో హానికరమైన సమ్మేళనాలు వస్తున్నాయట. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ మరియు చెన్నైలోని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
25 నుంచి 45 వయసు గల కొంతమంది వ్యక్తులను తీసుకొని.. వారికి తక్కువ AGE(అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) వంటకాలు, ఎక్కువ AGE వంటకాలు రెండు రకాల ఆహారాలు ఇచ్చారు. AGE అంటే ఎక్కువ సేపు వేడి చేసి వండిన ఆహరపదార్థాల్లో ఏర్పడే హానికరమై సమ్మేళనాలు. వారు12 వారాల పాటు ఇదే డైట్ ఫాలో చేశారు. ఇలాంటి పదార్థాలు తినేటప్పుడు వారిలో AGE వాపు, ఇన్సులిన్ నిరోధకత, ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తున్నాయట. హానికరమైన సమ్మేళలనాలు మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. సమోసా, పకోడి, చిప్స్, వేయించిన చికెన్ వంటి ఆహరపదార్ధాలు తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగటం పరిశీదకులు గమనించారు.
ALSO READ | యువతలో గుండె జబ్బులు.. పెరగటానికి కారణాలు.. ఎందుకిలా ..!
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన పరిశోధనలు సంచలనంగా ఉన్నాయి. తక్కువసేపు ప్రాసెస్ చేసిన ఫుడ్ తిన్న వారి శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని గణనీయంగా మెరుగుపడంది. దీనిని ఓరల్ డిస్పోజిషన్ ఇండెక్స్ (DIo) అని పిలిచే పరీక్ష ద్వారా కొలుస్తారు.
ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది రక్తంలో చక్కెరను తగ్గించడానికి శరీరం ఇన్సులిన్ (హార్మోన్)ని ఎంత బాగా ఉపయోగిస్తుందో సూచిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేయడంలో బలహీనమైన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఒక ముఖ్య అంశం. తక్కువ- AEG డైట్‌లో పాల్గొనేవారు తిన్న 30 నిమిషాల తర్వాత రక్తంలో తక్కువ షుగర్ లెవల్స్ నమోదైయ్యాయి. భారతదేశంలో మొదటిసారిగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ వయస్సు గల (అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) ఆహారం మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కాల్చిన లేదా వండిన పదార్థాలు మధుమేహానికి కారణమవుతాయని పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ AEG ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను అందించలేదు. అంతేకాదు గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
ఈ కింది ఆహారాలు పదార్థాలు వారి AEGల వారిన తినడం చాలా ప్రమాదం
- వేయించిన ఆహారాలు: చిప్స్, వేయించిన చికెన్, సమోసాలు, పకోరాలు
- కాల్చిన వస్తువులు: కుకీలు, కేకులు, క్రాకర్లు
- ప్రాసెస్ చేసిన ఆహారాలు: రెడీమేడ్ భోజనం, వనస్పతి, మయోన్నైస్
- అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన జంతు ఆధారిత ఆహారాలు: బేకన్, గొడ్డు మాంసం మరియు పౌల్ట్రీ వంటి కాల్చిన లేదా కాల్చిన మాంసాలు
- కాల్చిన గింజలు: పొడి గింజలు, కాల్చిన వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు విత్తనాలు