- మాదిగలకు కాంగ్రెస్‌తోనే న్యాయం
హైదరాబాద్, వెలుగు: అమ్ముడుపో యిన నాయకుల మాటలు నమ్మకుండా మాదిగలందరూ కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ కోరారు. మాదిగలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రాగానే కులగణన చేసి, జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిన రాహుల్‌గాంధీకి, మాదిగల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగలంతా సపోర్ట్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.