ప్రణాళికబద్ధంగా చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు: సంపత్​కుమార్

​కామారెడ్డి, వెలుగు: ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్​  సంపత్​కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్ఆర్కే డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ ​డే నిర్వహించారు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారన్నారు. వారి  నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదవాలన్నారు. సీఈవో జైపాల్​రెడ్డి,  ప్రిన్సిపాల్​దత్తాద్రి, ప్రతినిధులు మధుసూదన్​రెడ్డి, నవీన్​కుమార్, రాజేశ్వర్ పాల్గొన్నారు.