తమిళ కమేడియన్ యోగిబాబు(Yogibabu) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేల(Mandela). మడోన్నే అశ్విన్(Madonne ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక మంగలివాడి కథే మండేలా. కామెడీగా సాగుతూనే ఎమోషన్ ను పండించిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు అవార్డ్స్ కూడా వరించాయి.
అలాంటి అవార్డు విన్నింగ్ పాత్రలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) నటించాడు. మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. మార్టిన్ లూథర్ కింగ్(Martin Luther King) సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహించగా..కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ మూవీ ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 27) థియేటర్లో రిలీజయింది.
కథ:
ఈ కథ ఎంతో ఆలోచింప చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో జరిగే ఎలక్షన్స్ అన్నీ..ఓటుకు నోటుతో సంబంధం ఉందనే భావనను ఇందులో చూపించినట్లు అర్ధం అవుతుంది. అలా..పడమరపాడు గ్రామంలో రెండు వర్గాల మధ్య నడిచే ఎలక్షన్స్ ను సరికొత్త పంథాలో చూపించారు డైరెక్టర్. ఉత్తరం వైపు జగ్గు వర్గం వారుంటే (నరేశ్) , దక్షిణం వైపు మరొకరు లోకి (వెంకటేశ్ మహా) ఉంటారు. ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఇలా రెండు వర్గాలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాయి. ఇంతలో ఊళ్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. దక్షిణం వాళ్ల నుంచి వెంకటేష్ మహా..ఉత్తరం నుంచి నరేష్ పోటీకి దిగడంతో స్టోరీ రసవత్తరంగా ముందుకు వెళుతుంది.
అయితే, రెండు వర్గాలకు చిన్న చిక్కు మొదలవుతుంది. ఇక వారి ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఇద్దరికీ సమాన ఓట్లు పడనున్నట్లు ముందే తెలిసిపోతుంది. వీరిలో ఎవరికి మరొక్క ఓటు పడినా సర్పంచ్ పదవితో పాటు..చాలా విలువైన సుమారు రూ.30కోట్ల ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఒక్క ఓటు కోసం జగ్గు, లోకి వేట ప్రారంభిస్తారు. అందులో వీరిలో ఎవరు గెలవాలన్న ఒక్క ఓటు తక్కువ వస్తుంది.
ఇక ఊళ్లో ఆ ఒక్క ఓటు కోసం వెతుకుతున్న టైంలో..అసలు ఓటు హక్కే లేని స్మైల్ (సంపూర్ణేశ్ బాబు) కనిపిస్తాడు. అతడి పేరు కూడా ఊళ్లో వాళ్లకు సరిగా తెలీదు. అతడు ఒక అనాథ. చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తాడు. అందుకు ఆ ఊరిలో ఉన్న మర్రి చెట్టే తనకు ఇల్లు. ఊర్లో ఉన్న వాళ్లంతా స్మైల్ ని ఎడ్డోడు.. వెర్రిబాగులోడు.. అంటూ రకరకాల పేర్లతో ఆటపట్టిస్తుంటారు. స్మైల్ కు ఎప్పటికైనా సొంతంగా ఓ చిన్న చెప్పుల షాప్ పెట్టుకోని బతకాలన్నది తన కోరిక. అందుకు రోజుకో రూపాయి రూపాయి పోగు చేసి కొంత డబ్బు పోగు చేసుకుంటాడు. అంతలోనే తను దాచుకున్న డబ్బును ఎవరో కొట్టేస్తారు.
దీంతో తన స్నేహితుడు బాటా సలహా మేరకు పోస్టాఫీసులో డబ్బు దాచుకోవాలని డిసైడ్ అవుతాడు. అక్కడ పోస్టాఫీస్‌లో పని చేసే వసంత (శరణ్య ప్రదీప్) ను ఒక సాయం కావాలని కోరతాడు. అయితే పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమా చేయాలి అని అడుగుతాడు. అందుకు స్మైల్ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు.. ఇలా ఏ గుర్తింపు కార్డు కూడా ఉండదు. నిజానికి తన అసలు పేరేంటో తనకే తెలియదు. వసంతే అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అనే కొత్త పేరుతో పిలిచి..పోస్టాఫీస్‌లో ఖాతా తెరుస్తుంది. ఇక వరసగా సీన్స్ తో ఓటు హక్కు ఇచ్చే అధికారిణి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో ఓటరు ఐడీ కార్డు ఇస్తుంది. ఈ కార్డు నిజంగానే అతడిని కింగుమేకర్ ను చేస్తుంది? అందుకు గల సీన్స్ తో ఆసక్తికర సన్నివేశాలు ఊర్లో ఎలా చోటు చేసుకున్నాయి? ఆ ఓటు కోసం ఇక రెండు వర్గాలు అతడి వెంటబడటం వల్ల అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? జగ్గు, లోకిలు వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తన ఒక్క ఓటుతో ఊరిని ఎలా మార్చాడు ? అన్నది ఇక మిగతా కథ.
ఎలా సాగిందంటే :
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఓటుకు నోటు రాజకీయాల అంశాలపై మూవీ తెరకెక్కిందని అర్ధం అవుతుంది. ఈ స్టోరీని తెరకెక్కించడానికి డైరెక్టర్ గ్రౌండ్ లెవెల్ నుంచి.. అసలు గ్రామ రాజకీయాలు ఎలా సాగుతాయనే అంశాన్ని చాలా చక్కగా చూపించింది. ఎన్నికల్లో రాజకీయ నాయకుల లోపల ఉన్న అసలు స్వరూపాలను, మోసాలను, ఓటర్లను లొంగదీసుకోవడానికి రాజకీయ నాయకులూ వేసే ఎత్తులు..పై ఎత్తులకు ఓటర్ల అమాయకత్వాలను ఆవిష్కరిస్తూ తీసిన చిత్రం `మార్టిన్ లూథర్ కింగ్.
పడమర పాడు అనే గ్రామంలో ఇరు వర్గాలు గలవాడు కావాల్సిన ఒక్క ఓటు కోసం రాజకీయ నాయకులకు ఎలాంటి చుక్కలు చూపించిందనే అంశాల్ని కొత్త దర్శకురాలైన పూజా చక్కగా తెరకెక్కించారు. ఇరు వర్గాల మధ్య గొడవ కారణంగా వాటర్ ట్యాంకులు ధ్వంసం చేసి అదే గొడవ పెట్టిన సర్పంచ్ కొడుకు వద్ద నీళ్లు కొనుక్కోవడం, ఊర్లో ఉన్న స్కూల్ ధ్వంసం చేసి పక్క ఊరికి బడికి వెళ్లడం, మరికొందరు చదువులు మానేయడం వంటి సన్నివేశాలు రాజకీయ నాయకుల వల్ల అమాయక ప్రజలు ఎంతగా బలవుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు.
అయితే ఇక్కడ చిన్న విషయాన్నీ డైరెక్టర్ మరిచిపోయినట్టుంది.మార్టిన్ లూథర్ కింగ్ వంటి మెస్సేజ్ ఒరియింటెడ్ చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి తెరపై చూపించగలిగి ఉంటే సినిమా మరింత చక్కగా వచ్చేది. ఈ ఒక్క విషయంలో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ కాస్తా వెనకబడినట్లు తెలుస్తోంది.
చిన్న గ్రామమైన పడమరపాడు మూలలను చూపిస్తూ..అక్కడి ప్రజల సహాజ వ్యక్తిత్వాల్ని చూపిస్తూ దర్శకురాలు చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక ఊర్లో ఉన్న జనాన్ని పరిచయం చేస్తూ వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇదే క్రమంలో ఊర్లో చిన్న పంచాయితీ షురూ అవుతుంది. ఊర్లో ఒక వాడాలో మరుగుదొడ్డి ఓపెనింగ్ ఎపిసోడ్ లో రెండు వర్గాలు మధ్య సాగిన సంభాషణలతో.. రసవత్తరమైన కామెడీ సీన్స్ కు ఆడియన్స్ థియేటర్లో కడుపుబ్బా నవ్వుతారు.
ఇక అక్కడే మరో ముఖ్య పాత్ర అయిన స్మైల్ ప్రపంచాన్ని..ఊరి ప్రజలు అతనితో వ్యవహరించే తీరును చూపిస్తూ..అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పూజా. స్మైల్ దాచుకున్న డబ్బుల్ని ఎవరో దొంగలించడం.. దీంతో తను డబ్బులు దాచుకునేందుకు స్మైల్ పోస్టాఫీస్‌లోకి వెళ్లడం.. అక్కడ తనకు అవసరమైన గుర్తింపు కార్డులను పొందడం. అందులో భాగంగానే ఓటరు ఐడీ కార్డు కులాడ పొందడం వంటి సీన్స్ తో చక చక నడుస్తుంటది కథ.
మార్టిన్ పోస్టాపీసులో అడుగుపెట్టడం.. అక్కడ వసంత పరిచయం అవ్వడం..అతనికి మార్టిన్ లూథర్ కింద్ పేరు పెట్టడం..దీంతో కథ మలుపు తెరిగుతుంది. ఊర్లో ఇరు వర్గాల నాయకులకి అవసరమైన ఒక్క ఓటు కోసం మార్టిన్ దగ్గర పోవడం వరకు కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక్కడ నుంచి కథ ఆసక్తి సాగుతుంది. జగ్గు, లోకీ లు యర్రలో ప్రజలని తమ వైపుకి తిప్పుకునేందుకు వేసే ఎత్తులు..పై ఎత్తులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. దీంతో ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ తో.. సెకాండఫ్ పై ఫోకస్ పడే డైరెక్టర్ చేసిన తీరు బాగుంటుంది.
మార్టిన్ లూథర్ కింగ్ ఓటు కోసం లోకి, జగ్గు చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ స్టార్ట్ అవుతోంది. అలా ఊర్లో ప్రజలకి కూడా మార్టిన్ ఓటు కీలకమని భావిస్తారో..అక్కడ్నుంచి ఊరి వారంతా అతనితో వ్యవహరించే తీరు పూర్తిగా మారిపోతుంది. అక్కడ కొన్ని సీన్స్ ఆలోచింపజేసేలా రాసారు వెంకటేష్ మహా. ఇక మార్టిన్‌ను లోగదీసుకునేందుకు..జగ్గు, లోకి పోటీ అతనికి కానుకలు ఇవ్వడం..దాంతో నా ఓటు ఎవరికి వేయాలో.. నాకే అర్ధం అవ్వట్లే..అని చెప్పడం నవ్వించేలా చేస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో మార్టిన్ నుంచి చాలా మెస్సేజ్ సీన్స్ ఉన్నప్పటికీ..క్లైమాక్స్ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది అనే ఫీలింగ్ కలిగిస్తోంది.
ఎవరెలా చేశారంటే :
మార్టిన్ లూథర్ కింగ్ క్యారెక్టర్ లో నటించిన సంపూర్ణేష్‌బాబు యాప్ట్ గా నిలిచాడు. అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో..తనదైన ఎమోషన్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. అయన గత చిత్రాల్లో భారీ డైలాగ్స్ తో అరుపులు పెట్టించిన, ఇందులో మాత్రం చాలా సెటిల్డ్ గా నటించాడు. భావోద్వేగభరితమైన పాత్రతో తనలో ఒక మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తనతోపాటు ఉన్నబుడ్డోడు చాలా బాగా చేశాడు. అతనికి నటుడిగా ఫ్యూచర్ లో మంచి పాత్రలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఊర్లో సర్పంచ్ అభ్యర్థులుగా వెంకటేష్ మహా, నరేష్ తమ పాత్రలకు చాలా న్యాయం చేశారని చెప్పుకోవొచ్చు.నిజంగా మన ఊర్లో మెదిలే పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా రాసుకుని..ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. అందుకు ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ పోటీపడి చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రంలో పోస్టాఫీసు ఉద్యోగిగా, సంపూకి అండగా నిలిచే అమ్మాయిగా శరణ్య ప్రదీప్ నటన ఎంతో ఆలోచింపజేసేలా ఉంటుంది. బాగా చేసింది. పెద్దాయన పాత్రలో నటించిన రాఘవన్ తన పాత్ర పరిధిలో నటించి మెప్పించాడు. ఇందులో నటించిన మిగతా వారు తమ పాత్రల పరిధి మేరకు, సహజంగా నటించారు.
టెక్నీషియన్లు :
డైరెక్టర్ కు ఈ సినిమా తొలి సినిమా అయిన చాలా చక్కగా తెరకెక్కించింది. అందులో స్క్రీన్ ప్లే రైటర్ వెంకటేష్ మహా సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ తనలోని టాలెంట్ ను మాత్రం బయటకు తీసింది పూజా. కాకపోతే కామెడీ, ఎమోషనల్ సీన్లపై మరింత వర్క్ చేయాల్సి ఉంటే ఇంకా బాగుండేది. స్మరణ్ సాయి సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు ఆకట్టుకుంటూ, సినిమాని మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
మరో గొప్ప విశేషం..ఈ సినిమాకి దర్శకురాలే ఎడిటర్ కావడం.కానీ ఇంకాస్తా సినిమాను ట్రిమ్ చేయాల్సి ఉండేది. అందుకు అనవసరమైన సాగదీత సీన్లు కట్ చేస్తే బాగుండేది. కెమెరామెన్ దీపక్ యరగెరా వర్క్ బాగుంది. సహజంగా ఊర్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేశాడు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్‌వర్క్ సైతం చాలా చక్కగా కుదిరేలా చేశాడు.