తమిళ కమేడియన్ యోగిబాబు(Yogibabu) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేల(Mandela). మడోన్నే అశ్విన్(Madonne ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక మంగలివాడి కథే మండేలా. కామెడీగా సాగుతూనే ఎమోషన్ ను పండించిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు అవార్డ్స్ కూడా వరించాయి.
అలాంటి అవార్డు విన్నింగ్ పాత్రలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) నటిస్తున్నాడు. మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మార్టిన్ లూథర్ కింగ్(Martin Luther King) అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా..కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్‌ప్లే, మాటలు రాసి.. పూజ కొల్లూరును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.
అంతేకాదు, ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు తనదైన ఆకట్టుకుంటున్నాడు.
టీజర్ విషయానికి వస్తే..
ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య నడిచే ఎలక్షన్స్ ను సరికొత్త పంథాలో చూపించారు డైరెక్టర్. ఉత్తరం వైపు ఒక వర్గం వారుంటే, దక్షిణం వైపు మరొకరు ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. ఇలా రెండు వర్గాలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాయి. ఇంతలో ఊళ్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. దక్షిణం వాళ్ల నుంచి వెంకటేష్ మహా.. ఉత్తరం నుంచి నరేష్ పోటీకి దిగుతారు.
అయితే, రెండు వర్గాలకు చిన్న చిక్కు స్టార్ట్ అవుతుందంటూ ఆసక్తి కలిగించారు. వీరు గెలవాలంటే ఒక్క ఓటు తక్కువ వస్తుంది. ఊళ్లో ఆ ఒక్క ఓటు కోసం వెతుకుతున్న టైంలో అసలు ఓటు హక్కే లేని నాయీ బ్రాహ్మణుడు కనబడతాడు. అతడి పేరు కూడా ఊళ్లో వాళ్లకు సరిగా తెలీదు. ఇక ఓటు హక్కు ఇచ్చే అధికారిణి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో ఓటరు గుర్తింపు కార్డు ఇస్తుంది.
ఈ కార్డు నిజంగానే అతడిని కింగుమేకర్ ను చేస్తుంది. ఆ ఓటు కోసం ఇక రెండు వర్గాలు అతడి వెంటబడతాయి. ఈ క్యారెక్టర్ చాలా ఫన్నీగా, క్యూరియాసిటీగా ఉండేలా స్క్రీన్ ప్లే రాశాడు వెంకటేష్ మహా. ఆ క్యారెక్టర్‌ను హీరో సంపూర్ణేష్ బాబు పోషించారు. చాలా అరుదైన పాత్రలో నటించడం సంపూ కి ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో సంపూ ఏమేరకు మెప్పిస్తారో చూడాలి మరి. ఈ మూవీ 2023 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.