బోధన్, వెలుగు: మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీల కోసం హమాలీ వర్కర్స్ వెల్పేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం డిమాండ్ చేశారు. ఆదివారం బోధన్‌లోని గంజ్‌లో హమాలీ నాయకులు, కూలీల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సామ్రాజ్యం మాట్లాడుతూ హమాలీలకు భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
తమ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల టైమ్‌లో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో 600 మంది హమాలీలు సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోధన్హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్కనిగంటి శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షుడు హనుమంతప్ప పాల్గొన్నారు.