ఆడపిల్లలకు ఎంతో అవసరం.. గుడ్ టట్, బ్యాడ్ టచ్ టీచ్ చేసే బొమ్మ

ఎవరు ఏ ఉద్దేశంతో అమ్మాయిలను తాకుతున్నారో చిన్న పిల్లలు గుర్తించలేరు. తల్లిదండ్రులు చిన్నారులకు మంచి, చెడు స్పర్శల గురించి నేర్పించాలి. కొందమంది పిల్లలతో ఇలాంటి విషయాలు మాట్లాడటానికి నామోషీగా ఫీల్ అవుతారు. స్కూల్లో టీచర్లు కూడా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లకు చెప్పారు. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని చెప్పడానికి ఐఐఐటీ చదివిన యువకుడు ఓ బొమ్మను తయారు చేశాడు. దాని పేరే సంస్కార్..

వరంగల్‌కు చెందిన యాకర గణేష్ (26 ) రూపొందించిన 'సంస్కార్' బొమ్మ ఇప్పటివరకు 60వేల మంది విద్యార్థినీలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించింది. సంస్కార్ బొమ్మను ఉపయోగించడం చాలా ఈసీ. ఎవరైనా బొమ్మ ప్రైవేట్ భాగాలపై చేతిని ఉంచినప్పుడు, అది వెంటనే "ముట్టుకోవద్దు" అని అరుస్తుంది. బొమ్మ ఇచ్చే ఆడియో సిగ్నల్స్ కోసం గణేష్ తన స్నేహితులతో పాటు వేర్వేరు వ్యక్తుల వాయిస్ లను రికార్డ్ చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి బొమ్మను బోధనా సామగ్రిగా స్వీకరించారు. రికార్డింగ్ కోసం మాజీ జిల్లా కలెక్టర్ ఆమె వాయిస్ ఇచ్చారు. 

గణేష్ సంస్కార్ బొమ్మను మొదటిగా తెలంగాణ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబుకు ప్రదశించి, లాంచ్ చేశాడు. ఈ బొమ్మ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు కొంకణితో సహా ఏడు భాషలలో మాట్లాడగలదు.  గణేష్ ఫస్ట్ 60 సంస్కార్ బొమ్మలు తయారు చేశాడు. ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ఓ పాఠశాల బొమ్మపై ఆసక్తి చూపింది. వాళ్లు సంస్కార్ కోసం ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం గణేష్ సంస్కార్ 2.0కి తయారు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కొన్న మోడిఫికేషన్ ఫీచర్స్ అందిస్తానని గణేష్ చేప్తున్నాడు. మన కీ బాత్ లో ప్రధాని మోదీ కూడా గణేష్ ఆవిష్కరణలను మెచ్చుకున్నాడు.