న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఆ టీమ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ బలంగా తగలడంతో శాంసన్ చూపుడు వేలు విరిగింది.
ప్రస్తుతం తన హోమ్‌టౌన్ తిరువనంతపురం వెళ్లిన సంజూ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరి పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి ట్రెయినింగ్ ప్రారంభించనున్నాడు. ‘శాంమ్సన్ కుడి చూపుడు వేలు విరిగినట్టు స్కానింగ్‌లో తేలింది. ఈ నెల 8–-12 వరకు పుణెలో జమ్మూ కాశ్మీర్‌తో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కేరళ తరపున ఆడే చాన్స్ లేదు. ఐపీఎల్‌తోనే తిరిగి మైదానంలో వచ్చే అవకాశం ఉంది’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.