Sanju Samson: దేశవాళీ క్రికెట్‌లోనూ నిరాశే..! బాస్కెట్‌బాల్ బాట పట్టిన శాంసన్

Sanju Samson: దేశవాళీ క్రికెట్‌లోనూ నిరాశే..! బాస్కెట్‌బాల్ బాట పట్టిన శాంసన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. అసలే జట్టులో చోటు దక్కడం కష్టమనుకుంటే వచ్చిన అవకాశాలను ఈ కేరళ బ్యాటర్ వినియోగించుకోలేకపోయాడు. శ్రీలంకతో వన్డే జట్టులో స్థానం కోల్పోయిన సంజు.. టీ20 ల్లో 15 మంది స్క్వాడ్ లో ఎంపికయ్యాడు. టీ20 ల్లో చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో అవకాశం దక్కినా అతను రెండు మ్యాచ్ ల్లో డకౌట్స్ అయ్యాడు. రెండో టీ20ల్లో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన శాంసన్.. మూడో టీ20లో మూడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరువలేదు. 

శాంసన్ ప్రదర్శనతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. టీ20 కెరీర్ ముగిసిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ఐపీఎల్ ఆడినంత సింపుల్ కాదు ఇండియాకు ఆడడమంటే అని విమర్శిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే దులీప్ ట్రోఫీకి సైతం శాంసన్ ను ఎంపిక చేయలేదు. నాలుగు స్క్వాడ్ లో లోనూ శాంసన్ కు అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది. దీంతో శాంసన్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. 

భారత జట్టు ప్రాక్టీస్ జెర్సీని వేసుకొని బాస్కెట్‌బాల్ కోర్టులో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో శాంసన్ తన స్నేహితులతో లైట్ల కింద ఫుట్‌బాల్‌ను ఆడుతున్నాడు. బాస్కెట్‌బాల్ కోర్టులో ఫుట్‌బాల్ ఆడటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చివరిసారిగా సంజు శాంసన్ 2024 టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ లోనూ తుది జట్టులో స్థానం దక్కలేదు.