బెంగళూరు: రాజస్తాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్.కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేసేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో అతను కీపింగ్‌తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ శాంసన్ కుడి చూపుడు వేలికి బలంగా తాకడంతో ఎముక విరిగింది.
సర్జరీ చేయించుకొని కోలుకున్నప్పటికీ రాజస్తాన్ ఆడిన మూడు మ్యాచ్‌లో శాంసన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. పరాగ్ కెప్టెన్సీ చేశాడు. ‘శాంసన్ ఫిట్‌నెస్‌ను ఎన్‌సీఏ మెడికల్ టీమ్ అంచనా వేసింది. అన్నీ బాగుండటంతో కీపింగ్‌కు ఓకే చెప్పింది. పంజాబ్ మ్యాచ్‌లో అతను పూర్తి బాధ్యతలు చేపట్టనున్నాడు’ అని రాయల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.