కొడితే వంద లేదా డకౌట్. టీమిండియా వికెట్ కీపర్/ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడుతున్న తీరు అచ్చం ఇలానే ఉంది. తానాడిన చివరి ఐదు టీ20ల్లో మూడు శతకాలు బాదిన శాంసన్.. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. అవుట్ అయ్యాడా..! అది ఆదిలోనే.. లేదంటే వంద కొట్టే వరకు మైదానాన్ని వీడటం లేదు.
శుక్రవారం(నవంబర్ 15) సఫారీలతో జరిగిన ఆఖరి టీ20లో సెంచరీ చేసిన ఈ వికెట్ కీపర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్ గా రెకార్డుల్లోకెక్కాడు. అంతేకాదు, టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు.
ALSO READ : హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్.. ఆంధ్ర బ్యాటర్ డబుల్ సెంచరీ
గతనెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ నమోదు చేసిన సంజూ.. సౌతాఫ్రికాతో తొలి టీ20లో మరో శతకం నమోదు చేశాడు. అనంతరం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వగా.. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో మెరుపు శతకం బాదాడు. 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు.
Sanju Samson's last 5 T20I innings:
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2024
💯 Hundred
🦆 Duck
🦆 Duck
💯 Hundred
💯 Hundred
𝘏𝘢𝘱𝘱𝘺 𝘢𝘭𝘭𝘦? pic.twitter.com/WBqZmo5eZD
మరికొన్ని రికార్డులు
- టీ20ల్లో భారత జట్టు తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్ శాంసన్. (మొదటి ఇద్దరు రోహిత్ శర్మ, సూర్య)
- ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్ సంజూ.
- అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి వికెట్ కీపర్ శాంసన్.
- ఈ సెంచరీతో సంజూ ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌ను అధిగమించాడు. సాల్ట్ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 2 శతకాలు నమోదు చేయగా.. భారత వికెట్ కీపర్ మూడు శతకాలతో దానిని అధిగమించాడు.
The Sanju Samson & Tilak Varma stocks go up a 💯% #SAvIND pic.twitter.com/vZDS3iSFln
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024