కీపింగ్‌‌‌‌కు అనుమతి కోసం సీవోఈకి శాంసన్

కీపింగ్‌‌‌‌కు అనుమతి కోసం సీవోఈకి శాంసన్

ముంబై: చేతి వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్‌‌‌‌లో కీపింగ్‌‌‌‌ చేసేందుకు పూర్తిస్థాయి అనుమతి పొందేందుకు బెంగళూరులోని  బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు వెళ్లాడు.  గాయానికి సర్జరీ చేయించుకున్న సంజూ సీవోఈలో కోలుకున్నప్పటికీ బ్యాటింగ్‌‌‌‌కు మాత్రమే పరిమిత అనుమతి లభించింది. 

దీంతో ఈ సీజన్  తొలి మూడు మ్యాచ్‌‌‌‌ల్లో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా మాత్రమే బరిలోకి దిగాడు. ధృవ్ జురేల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.  ఈ నెల 5న ముల్లాన్‌‌‌‌పూర్‌‌‌‌లో పంజాబ్ కింగ్స్‌‌‌‌తో తదుపరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో శాంసన్ ఫైనల్ ఫిట్‌‌‌‌నెస్ టెస్టులను  క్లియర్ చేస్తే  వికెట్‌‌‌‌కీపర్‌‌‌‌గా తిరిగి జట్టులోకి రావడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు.

పరాగ్‌‌‌‌కు  రూ. 12 లక్షల జరిమానా

చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  గెలిచి రాజస్తాన్ రాయల్స్  విజయాల ఖాతా తెరవగా.. ఆ మ్యాచ్‌‌‌‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌‌‌‌లో రాయల్స్ జట్టు చేసిన తొలి తప్పిదం కావడంతో  కెప్టెన్ పరాగ్‌‌‌‌కు జరిమానా విధించారు.