
కొత్త స్మార్ట్ ఫోన్లు..ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అద్భుతం..మార్చిలోనే లాంచ్ అయ్యాయి. లాంచ్ అయిన నెలరోజుల్లోనే భారీ డిస్కౌంట్.. గెలక్సీA56, సామ్ సంగ్ గెలాక్సీ A36 స్మార్ట్ ఫోన్లను వాటి ప్రారంభ ధరనుంచి భారీ డిస్కైంట్లను అందిస్తోంది సామ్ సంగ్.
ఈ ఏడాది మార్చిలో సామ్ సంగ్ తన గెలాక్సీ A56 , గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం లాంచ్ అయిన గెలాక్సీ A55 ,గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్లు లేటెస్ట్ మోడల్స్.ఈ స్మార్ట్ ఫఓన్లు లాంచ్ అయిన ఒక నెలలోనే కొరియన్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు కంపెనీ మొదటిసారిగా ధర తగ్గింపును అందిస్తోంది. తన గెలాక్సీ A36 మరియు గెలాక్సీ A56 మోడళ్లకు వాటి లాంచ్ ధరల నుంచి రూ. 5వేలవరకు తగ్గించింది. ఈ మోడళ్లలో ట్రిపుల్ కెమెరా సెటప్ ,AMOLED డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy A56,Galaxy A36 ప్రారంభ ధర, డిస్కౌంట్ ధర
Samsung Galaxy A56 మూడు వేరియంట్లలో లభిస్తుంది..
128GB +8GB RAM, ప్రారంభ ధర రూ. 41వేల999, రూ.5వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 36వేల 999
256GB +8GB RAM , ప్రారంభ ధర రూ. 44వేల999, రూ.5వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 39వేల 999
256GB +12GB RAM. ప్రారంభ ధర రూ. 47వేల 999 ,రూ.5వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 42వేల 999
అదేవిధంగా
Samsung Galaxy A36 ప్రారంభ ధర, డిస్కౌంట్ ధర
మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
128GB +8GB RAM, ప్రారంభ ధర రూ.32వేల 999 ,రూ.4వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 28వేల 999
256GB +8GB RAM ప్రారంభ ధర రూ.35వేల 999,రూ.4వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 331వేల 999
256GB +12GB RAM. ప్రారంభ ధర రూ.38వేల 999,రూ.4వేల డిస్కౌంట్ తర్వాత ధర రూ. 34వేల 999