
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సహ-CEO హాన్ జోంగ్-హీ మంగళవారం(మార్చి25) గుండెపోటుతో మృతిచెందారు.63ఏళ్ల హాన్ ఆసుపత్రిలో గుండెపోటుకు చికిత్స పొందుతూ మరణించారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి, అతని తర్వాత ఎవరు వస్తారో శామ్‌సంగ్ వెల్లడించలేదు. హాన్ ముప్పై ఏళ్లుగా శామ్ సంగ్ లో సేవలందిస్తున్నారు. డిస్ ప్లే విభాగంలో కెరీర్ ప్రారంభించిన హాన్.. మూడేళ్ల క్రితం కంపెనీ సహ సీఈవోగా నియమితులయ్యారు. సోనీ గ్రూప్ వంటి పోటీదారులను ఎదుర్కొని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ను టీవీ మార్కెట్లో నంబర్ వన్ మార్చడంలో హాన్ కీలక పాత్ర పోషించారు.
టెలివిజన్ రంగంలో విజయం సాధించడంతో పాటు, హాన్ శామ్సంగ్ కస్టమర్ ఎలక్ట్రానిక్స్,మొబైల్ పరికర విభాగాలకు నాయకత్వం వహించాడు. ఇవి ఆపిల్ స్మార్ట్‌ఫోన్లతో పోటీ పడటంలో ,ఇటీవల శామ్‌సంగ్ గెలాక్సీ పరికరాల్లో AI టెక్నాలజీ రావడానికి హాన్ చాలా కృషి చేశారు. హాన్ మార్గదర్శకత్వంలో కంపెనీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు,వాక్యూమ్ క్లీనర్‌లతో సహా వివిధ గృహోపకరణాలలో AI చిప్‌లను చేర్చింది.