శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ సోమవారం మార్కెట్లోకి వచ్చేసింది. ఈ 5జీ ఫోన్లో ఈక్సినాస్ 1280 చిప్ సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.46 అంగుళాల స్క్రీన్, 50 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉంటాయి.
6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 20,999. అమ్మకాలు ఈ నెల 11 నుండి మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే డిస్కౌంట్లు కూడా పొందొచ్చు.