Samsung స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తన కొత్త మిడ్ రేంజ్ ఫోన్ Galaxy M55s సిరీస్ ను విడుదల చేసింది. ఇది స్లిమ్ ఫ్యూజన్ డిజైన్ తో వస్తోంది. 7.8 మిమీ , 180 గ్రాముల బరువుతో లైట్ వెయిట్ ఫీలింగ్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ కలర్లలో లభిస్తోంది.
Samsung Galaxy M55s ఫ్రంట్ లో 6.7 అంగుళాల Full HD+సూపర్ AMOLED ప్లస్ ఇన్ఫినిటీ -O డిస్ ప్లేను అద్భుతంగా ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ టెక్నాలజీ ద్వారా గరిష్టంగా 1000 nits బ్రైట్ నెస్ అందిస్తుంది.
Samsung Galaxy M55sస్మార్ట్ ఫోన్ లో హైబ్రిడ్ డ్యుయెల్ సిమ్ అంటే నానో+ నానార్ లేదా మైక్రో SD కార్డు) , టైప్ -C పోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ పనితీరును గమనిస్తే.. Adreno 644 GPU, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Samsung One 6.1OS, 8GB RAM, 128GB/256GB స్టోరేజ్(1TB వరకు మైక్రో SD కార్డు ద్వారా ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. 4nm క్లాస్ Qualcomm Snapdragon 7Gen 1 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ కెమెరా మాడ్యుల్ తో వస్తుంది.