
దిగ్గజ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ ఇండియాలో మరో అద్భుతమైన ఫోన్ లాంఛ్ చేసింది. తమ కంపెనీలో ఫేమస్ అయిన M సిరీస్ నుంచి ‘శాంసంగ్ గెలాక్సీ M56 5G’ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ కేవలం 7.2mm మందంతో ఉండటం హైలెట్. శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్లలో ఇదే అత్యంత సన్నని ఫోన్.
ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో పాటు పవర్-ప్యాక్డ్ ఫీచర్లు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. 2025, ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా భారత్‌లో వినియోగదారులకు ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ.3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫోన్ ఫీచర్స్:
- 7.2mm మందం, 180 గ్రాముల బరువు
- 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED+ డిస్‌ప్లే
- 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- 50 -మెగాపిక్సెల్‌తో ట్రిపుల్ రియర్ బ్యాక్ కెమెరా
- 12- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్
- 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C కనెక్టివిటీ
- ఆరు సంవత్సరాల వరకు అప్డేట్స్
ఫోన్ ధర ఎంతంటే..?
- ఈ ఫోన్ మొత్తం రెండు కలర్లలో అందుబాటులో ఉంది. నలుపు (బ్లాక్), లేత ఆకుపచ్చ (లైట్ గ్రీన్) రంగుల్లో ఉంటుంది.
- 8GB + 128GB ఫోన్ ధర రూ. 27,999
- 8GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999
- HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ. 3 వేల వరకు డిస్కౌంట్