ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్రాండెడ్ లలో సామ్ సంగ్(Samsung) ఒకటి. ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ కంపెనీనుంచి లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ రింగ్ లను కూడా అందిస్తోంది. జనవరి 2024లో మొదటి సారి స్మార్ట్ రింగ్ లను పరిచయం చేసిన సామ్ సంగ్.. జూన్ 2024లో తొలి స్మార్ట్ రింగ్ ను విడుదల చేసింది.. తాజాగా 2025 జనవరిలో లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్ రింగ్ గెలాక్సీ రింగ్ 2 ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Galaxy Ring 2 స్మార్ట్ రింగ్ వివిధ సైజుల్లో లభించనుంది. మొత్తం 11 సైజుల్లో అందించేందుకు సామ్ సంగ్ కంపెనీ రెడీ అవుతోంది. సామ్ సంగ్ గెలాక్సీ 2 స్మార్ట్ రింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. ఇది గత వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్లు, అప్ గ్రేడ్ తో లభించనుంది.
Also Read :- మారుతీ ఎలక్ట్రిక్ కారు e-Vitara వచ్చేస్తోంది
ఈ స్మార్ట్ రింగ్ లో అప్ గ్రేడ్ చేయబడిన స్పెసిఫికేషనల్లో బెస్ట్ బ్యాటరీ ఒకటి. Galaxy Ring 2 ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు వినియోగించవచ్చని అంచనా. ఈ స్మార్ట్ రింగ్ దాని టైటానియం ఫ్రేమ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఇది గెలాక్సీ రింగ్ IP68 రేటింగ్ తో పోలిస్తే మరింత మెరుగైన వాటర్ ప్రూఫ్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
AI ఆధారిత అప్ గ్రేడ్ లు, వివిధ రకాల సైజులో రింగ్ ఎంపికలు, బెస్ట్ బ్యాటరీ పనితీరు, IP69 రేటింగ్ లతో గెలాక్సీ రింగ్ 2 స్మార్ట్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ రింగ్ కోసం సామ్ సంగ్ గెలాక్సీ రింగ్ 2 లాంచింగ్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. Gaalxy Ring 2 స్మార్ట్ రింగ్ Samsung ఆవిష్కరణల్లో బెస్ట్ వన్ గా ఉండనుందని ఆశిస్తున్నారు.