![Samsung Galaxy S23: సగం ధరకే ఇస్తున్నారు.. త్వరపడండీ..](https://static.v6velugu.com/uploads/2025/02/samsung-galaxy-s23-now-cheaper-on-flipkart-as-price-drops-from-rs-95999-to-rs-49999_40dAB9t6vb.jpg)
ఇప్పుడు వాడుతున్న ఫోన్ బోర్ కొట్టేసింది.. మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి.. ఆన్ లైన్ బిగ్ సేల్ అనౌన్స్ చేసినపుడు తక్కువ ధరకే కొనాలి.. అనుకునే వారికి గుడ్ న్యూస్. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్-23 చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో చాలా లో ప్రైస్ కే అమ్ముతున్నారు.
గెలాక్సీ ఎస్-23 ఫోన్ ధర వాస్తవానికి రూ.95,999 కి నిర్ణయించారు. కానీ.. ప్రస్తుత సేల్ లో సగం ధరకే అంటే రూ.49,999 కు సేల్ చేస్తున్నారు. దీంతో పాటు యాక్సి్స్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కుంటే మరో 2,500 రూపాయలు తగ్గుతున్నాయి. అంటే రూ.47,499 కే ఈ ఫోన్ లభిస్తోంది.
ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
6.1 ఇంచుల (6.1-inch AMOLED) డిస్ప్లేతో 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీంతో గేమ్ ఆడటంలో లేదా వీడియోస్ చూస్తున్నపుడు చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది. అదే విధంగా Qualcomm Snapdragon 8 Gen 2 చిప్, 8జీబీ ర్యామ్, 256 జీమీ స్టోరేజ్ తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ఇక 3,950mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్ తో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 10MP నుంచి 12MP జనరేటివ్ కెమెరా ఉంటుంది.