గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ను శామ్సంగ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఈక్సినాస్ 2400ఈ ప్రాసెసర్, 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50ఎంపీ మెయిన్, 12ఎంపీ అల్ట్రావైడ్, 8ఎంపీ టెలిఫోటో), 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, అండ్రాయిడ్14 ఓఎస్ ఉంటాయి.
8జీబీ + 128జీబీ యూనిట్ ధర రూ.60 వేలు కాగా, 8జీబీ + 256 జీబీ యూనిట్ ధర రూ.66 వేలని కంపెనీ తెలిపింది. వచ్చే నెల మూడో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి.