కొత్త ఫోన్ కొనాలని అనుకునేవాళ్లకి ఇది మంచి అవకాశం.. శాంసంగ్ కంపెనీ తన 5G ఫోన్ల ధరలు తగ్గించింది. ఇండియన్ మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ ధరను భారీగా తగ్గించింది. గతేడాది (2023)లో మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్ రెండు వేరియంట్లతో లభిస్తోంది. ఈ రెండు వేరియంట్లపై రూ. 3 వేలు తగ్గించింది.
Samsung Galaxy M34 5G ని గతేడాది జూలైలో విడుదల చేసింది. ప్రారంభంలో కంపెనీ 6GB+128 GB వేరియంట్ ధర రూ. 18,999 ,8GB+128 GB వేరియంట్ ధ రూ. 20,999 గా నిర్ణయించింది. ఇప్పుడు ధర తగ్గింపు తర్వాత 6GB+128 GB వేరియంట్ ధర రూ. 15,999 కి కొనుగోలు చేయొచ్చు. 8GB+128 GB వేరియంట్ ధ రూ. 17,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ ఫాల్ బ్లూకలర్ ఆప్షన్లలో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ , డెబిట్ కార్డులపై కంపెనీ మరో రూ. 1000 తక్షణ తగ్గింపు కూడా ఇస్తోంది.
Samsung Galaxy M34 5G ఫీచర్లు
Samsung Galaxy M34 5G 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.5 అంగుళాల FHD+ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5GB RAM, Octa coe Exynos 1280 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంటర్నల్ మెమరీ 128GB. మెమరీ కార్డు సహాయంతో స్టోరేజీని 1TB వరకుపెంచుకోవచ్చు.
ఈ ఫోన్ Androind13 ఆధారిత OneUI పై పనిచేస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 13MP కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక భత్రత గురించి చెపితే.. సైడ్ మౌంటెడ్ ఫింగర ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ 6000mAh 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.