మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది.. ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు గ్యారంటీ ఇవ్వటం లేదు.. నిన్నా మొన్నటి వరకు ఐటీ కంపెనీల్లో ఉన్న లేఆఫ్స్.. ఇప్పుడు కన్జూమర్ ప్రొడెక్ట్స్ కంపెనీలకూ విస్తరించింది. ఇండియాలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయని.. కంపెనీల్లోకి ఆదాయం లేదంటూ శాంసంగ్ కంపెనీ.. ఇండియాలో 200 మంది సీనియర్ ఉద్యోగులపై వేటు వేసింది. రాబోయే రోజుల్లో శాంసంగ్ ఇండియాలో తన ఉద్యోగులను 20 శాతం మందిని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో శాంసంగ్ ప్రొడక్ట్‌ల అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల, మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగించేందుకు శాంసంగ్ సిద్ధమైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
ఉద్యోగుల కోత సింగిల్ డిజిట్ నుండి దాదాపు 20 శాతం వరకు ఉండొచ్చని తెలుస్తోంది. తొలగించబడిన ఉద్యోగులకు అగ్రిమెంట్ ప్రకారం మూడు నెలల జీతం, ప్రతి సంవత్సరం సర్వీస్‌కు ఒక నెల జీతం యొక్క విభజన ప్యాకేజీని అందజేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీని సైతం నిలిపివేసిందట. అంతేకాకుండా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన వారి స్థానాల్లో కొత్త నియామకాలు సైతం చేపట్టొద్దని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే, వారం క్రితం శామ్‌సంగ్ చెన్నై కర్మాగారంలో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే శాంసంగ్‌కు పండుగ సీజన్ వేళ ఉద్యోగుల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగల స్ట్రైక్‌తో కంపెనీలో భారీగా మాన్యుపాక్చరింగ్ నిలిచిపోయింది. తద్వారా కంపెనీ అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది.
Also Read:-అమెరికాను మళ్లీ నంబర్ వన్ గా నిలబెడతా