
బట్టలను శుభ్రం చేసుకోవడానికి ఎయిర్‌డ్రెస్సర్‌ను టెక్ కంపెనీ శామ్‌సంగ్ మంగళవారం లాంచ్ చేసింది. దీని ధర రూ. లక్షా పదివేలు. ఈ ఎయిర్ డ్రెస్సర్ ద్వారా బట్టలను స్టీమ్ చేసుకోవచ్చు. క్లాత్స్‌పై ఉన్న దుమ్మును, క్రిములను తొలగించుకోవచ్చు. ఈ ఎయిర్‌డ్రెస్సర్ ఒక కప్‌బోర్డ్‌లా కనిపిస్తుంది. కరోనా కొత్త రూపు దాల్చుకుందని జనం అంతా భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ప్రొడక్ట్ సేల్స్ భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దుస్తులను పూర్తిగా శానిటైజ్ చేయడంతోపాటు.. క్రిములను చంపుతుందని చెబుతున్న కంపెనీ.. ఈ ప్రొడక్ట్ కు ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచమంతా భారీ డిమాండ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.